CM KCR Maharashtra Tour: తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మంగళవారం కొల్హాపూర్‌లో గల అంబబాయి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.15 గంటలకు కొల్హాపూర్‌ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు కేసీఆర్. అనంతరం మహాలక్ష్మి స్వరూపమైన అంబబాయి అమ్మవారిని దర్శించుకుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో సాంగ్లి జిల్లాలోని వాటేగావ్‌ గ్రామంలో జరిగే ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకలకు హాజరవుతారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు సీఎం. మధ్యాహ్నాం ఒంటి గంటకు అన్నాభావూ కుటుంబ సభ్యులను కలుస్తారు. 1.30 గంటలకు ఇస్లాంపూర్‌లోని రఘునాథ్‌దాదా పాటిల్‌ ఇంట్లో భోజనం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల్ని నమ్మి ఆయన అడుగు జాడల్లో నడిచిన వ్యక్తుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నా భావ్ సాఠే (Lokshahir anna bhau sathe) ఒకరు. అంబేద్కర్ ఉద్దేశాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో విధాలుగా కృషి చేశారు. ఈయన తన రచనలతో ప్రజల్లో మార్పు తెచ్చారు. మరాఠా ఉద్యమంలో కీ రోల్ పోషించారు. అందుకే సీఎం కేసీఆర్ .. అన్నా భావ్ సాఠే జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరగనున్నాయని తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన సందర్భంగా అన్నా భావ్ సాఠే కోడలు, మనవడితోపాటు మరికొందరు స్థానిక నేతలు ఇవాళ బీఆర్ఎస్‌లో చేరనున్నారు టాక్ వినిపిస్తోంది. 


Also Read: Ramreddy Damodar Reddy: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook