Revanth Vs KCR: తెలంగాణలో కేసీఆర్ అధికారంలో వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. దాంతో తెలంగాణలో ఏ కులం ప్రజలు ఎంత మంది ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు. వాళ్ల ఆదాయ వ్యయ వివరాలు ప్రభుత్వం సేకరించింది. అప్పట్లో ఈ కుటుంబ సర్వేలే పాల్గొనని వారికీ ప్రభుత్వం అందించే పథకాలు వర్తించవే భయపెట్టారు. తీరా ఓ రోజు తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టింది. ఆ తర్వాత ఈ సర్వేతో ప్రభుత్వం ఏం చేసిందో ఎవరికీ తెలియదు. అపడెపుడో పదేళ్ల క్రితం కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే ను రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. ఈ మేరకు 2024, అక్టోబర్ 29న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్‎ను రిలీజ్ చేసింది. ఈ ఫామ్‎లో అధికారులు సేకరించనున్న వివరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం వెల్లడించింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు మొత్తం రెండు పార్టీలుగా వివరాలు సేకరించనున్నారు.


కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అధికారులు నమోదు చేసుకోనున్నారు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరించనున్నారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు వారి భూములు, రిజర్వేషన్లు, రాజకీయ నేపథ్య వివరాలను సైతం అధికారులు అడిగి తెలుసుకోనున్నారు. 2024, నవంబర్ 6వ తేదీ నుండి ఈ సర్వే మొదలు కానుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖకు ఈ సర్వే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter