CM K. Chandrashekar Rao Dussehra Wishes: హైదరాబాద్‌: తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం కేసీఆర్ వివరించారు. ఈ దసరా పర్వదినాన రాష్ట్ర ప్రజలకు సకల శాంతి సౌభాగ్యాలు ప్రాసదించాలని అమ్మవారిని కేసీఆర్ ప్రార్థించారు. కరోనావైరస్ మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యంగా.. సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని దుర్గాదేవిని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి కారణంగా.. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ప్రజలు దసరా పండుగను జరుపుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. Also read: Dussehra 2020: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కనకదుర్గమ్మ వారి కటాక్షం అందరిపై ఉండాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని వారు అమ్మవారిని ప్రార్థించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించి దసరా వేడుకలను జరుపుకోవాలని వారు ప్రజలను కోరారు. 


Also read: Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe