ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ( Chandrababu Naidu )  తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి కేసిఆర్ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని తానే డెవలెప్ చేశాను అని చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై  తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇస్తూ మాట్లాడారు.



దక్కన్ పీఠభూమి కారణంగా హైదరాబాద్ లో పరిశ్రమలు, సంస్థలను స్థాపిప్తే బాగుంటుంది అని పెద్ద పెద్ద సంస్థలు భావించాయి అని కేసీఆర్ తెలిపారు. అందుకే నాటి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ( Rajiv Gandhi ) వారు సంప్రదించారని వ్యాఖ్యానించారు. అందుకే హైదరాబాద్ కు అన్ని పరిశ్రమలు వచ్చాయి అని.. ఐటి రంగం తరలి వచ్చిందని తెలిపారు సీఎం కేసీఆర్.



హైదరాబాద్ లో ఐటి రంగం ప్రారంభం అవ్వడానికి ప్రధాన కారణం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ ( CM KCR ).  అయితే ఈ ఘనత అంతా తమదే అది మధ్యలో కొంత మంది ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు అని.. సొంత డబ్బా కొట్టుకున్నారు అని పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు.