TSRTC PRC: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున టిఎస్ఆర్టీసి ఉద్యోగులకు ఇవ్వనున్న పీఆర్సీకి అవసరమైన చట్టపరమైన అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు, భవనాలు, రవాణా శాఖ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారని అన్నారు. టిఎస్ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు పీఆర్సీ పెంపు ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నట్టు బాజిరెడ్డి గోవర్థన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయం అనంతరం సంస్థ ఉద్యోగులకు వెంటనే పిఆర్సి అమలు చేయనున్నట్టు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంచేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిఎస్ఆర్టిసి ఉద్యోగులకు నిన్న బస్ భవన్ సాక్షిగా 100 కోట్ల పెండింగ్ బకాయిలు, దీపావళి పండగ సందర్భంగా అడ్వాన్సులు ప్రకటించిన నేపథ్యంలో పిఆర్సి గురించి మీడియా ప్రస్తావించగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ ఉద్యోగుల పిఆర్సి గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పిఆర్సి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.


తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు 2017 నుండి రివైజ్డ్ పే స్కేల్ పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించడానికి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జానార్ ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగిందని.. అందులో భాగంగానే నేడు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారి లేఖలు రాసినట్టు బాజిరెడ్డి గోవర్థన్ మీడియాకు తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి నుంచి అనుమతి వచ్చిన వెంటనే టిఎస్ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయనున్నట్టు బాజిరెడ్డి గోవర్థన్ తేల్చిచెప్పారు.


Also Read : TRS VS BJP: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు కౌంటర్ ప్లాన్.. త్వరలో బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?


Also Read : Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి మరో వీడియో లీక్.. మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్ చెప్పేశాడు?


Also Read : Munugode Bypoll: యాదాద్రి ఒట్టు ఘటనపై ఈసీ సీరియస్.. టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి