CM Kcr: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ముక్త్ భారత్‌కు అంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. పోదామా జాతీయ రాజకీయాల్లోకి అంటూ ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఇందుకు మేధావులు, యువకులు కలిసి రావాలని..ప్రజలకు చైతన్యవంతం చేయాలన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు అంతా ముందుకు రావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయానికి మీటర్లు పెట్టాలని ఆలోచిస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. ఇటీవల తాను 26 రాష్ట్రాల రైతు నాయకులతో మాట్లాడనని..జాతీయ రాజకీయాల్లోకి రావాలని వాళ్లు ఆహ్వానిచ్చారని తెలిపారు. గుజరాత్ మోడల్ అంటూ దేశంలో అధికారంలోకి వచ్చి..నిత్యావసర ధరలను పెంచారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పాలు, పెరుగుపై జీఎస్టీ విధించి..డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. దేశ, ప్రజల సంపదను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


పెద్దపల్లి జిల్లా అవుతుందని తాను అనుకోలేదని..అది రాష్ట్ర అవతరణతో సాధ్యమయ్యిందన్నారు సీఎం కేసీఆర్. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సింగరేణిలో కార్మికులకు బోనస్ ఇచ్చామని..పెద్దపల్లి, మంథని ప్రాంతాలను మున్సిపాలిటీగా మార్చుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పోయి..రైతు సర్కార్ రానుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. గుజరాత్‌లో కల్తీ మద్యంపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. మత పిచ్చిగాళ్ల ఉన్మాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చెప్పులు మోయమని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్‌లో అమలు కాని పథకాలు తెలంగాణలో ఆచరణలో ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ నేతలంతా అవినీతి అక్రమాలు చేస్తున్నారని విమర్శించారు.


పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆరంభించారు. అనంతరం పార్టీ ఆఫీస్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. 


Also read:IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌ వల్ల క్రికెట్‌కు బ్యాడ్‌ డే..షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!


Also read:CM Jagan: సెప్టెంబర్ 1 నుంచి కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ టూర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి