IND vs PAK: ఆసియా కప్ 2022లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. క్రికెట్ అభిమానులకు మంచి కిక్‌కు ఇచ్చింది. ఐతే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు మాత్రం మ్యాచ్ తీరు నచ్చనట్లు ఉంది. దాయాది దేశాల మ్యాచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈమ్యాచ్ తనను ఆకట్టుకోలేదని..ఇరు జట్లు ఓడేందుకు ప్రయత్నించారని హాట్ కామెంట్స్ చేశాడు. ఇది క్రికెట్‌కు బ్యాడ్ డే అంటూ సెటైర్లు వేశాడు.
భారత్, పాకిస్థాన్ జట్లకు శుభాకాంక్షలు చెబుతున్నా..ఎందుకంటే ఇరుజట్లూ ఆటలో ఓడేందుకు ప్రయత్నించాయన్నాడు. ఇందులో టీమిండియా దాదాపు విజయవంతమైందని..కానీ హార్ధిక్ పాండ్య అడ్డు పడ్డాడని తెలిపాడు. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ సైతం అలాగే సాగిందన్నాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. రిజ్వాన్ 42 బంతుల్లో 43 పరుగులు చేశాడని..ఇది ఆశ్చర్యం కల్గిస్తోందని చెప్పాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్..తొలి ఆరు ఓవర్లలో 19 బంతులను వృధా చేసిందన్నాడు.
మరోవైపు ఇరుజట్ల ఆటగాళ్ల ఎంపిక సరిగా లేదన్నాడు. రిషబ్ పంత్‌ను ఎంపిక చేయకపోవడం ఏంటని అన్నాడు అక్తర్. పాకిస్థాన్ మాత్రం ఇఫ్తికార్ అహ్మద్‌ను నాలుగో స్థానంలో పంపడం..అతడ్ని అగౌరవపర్చడమేనని తెలిపాడు. బాబార్ అజామ్ ఓపెనింగ్‌కు రావొద్దని ఇప్పటికే చాలా సార్లు చెప్పానని గుర్తు చేశాడు. అతడు వన్‌డౌన్‌లో రావాల్సిన అవసరం ఉందన్నాడు. ఫఖర్ జమాన్, రిజ్వాన్ ఓపెనర్లుగా రావాలని సూచించాడు అక్తర్.
మొత్తంగా ఇరు జట్లు బ్యాడ్ క్రికెట్ ఆడాయని ఆరోపించాడు. తన బ్యాటింగ్ ఆర్డర్‌ను పాక్ సరిగా తీర్చిదిద్దలేదని..ఇటు భారత్ సైతం జడేజాను నాలుగో స్థానంలో పంపిందన్నాడు. ఇరు జట్లూ చాలా తప్పిదాలు చేశాయన్నాడు. అందుకే తనకు మ్యాచ్ ఆకట్టుకోలేదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ఎవరు ఏమనుకున్నా సరే లెక్క చేయనని..ఉన్నది ఉన్నట్లు చెబుతానని తన యూట్యూబ్ ఛానల్‌లో ఈమేరకు వెల్లడించాడు.
Tightly fought match but both teams played poor cricket at times. Some bad captaicy as well.
Full video: https://t.co/kfIqHUtAEn pic.twitter.com/OcoIWOXS2r
— Shoaib Akhtar (@shoaib100mph) August 28, 2022
Also read:Viral Video: వరద నీటిలో న్యూస్ రిపోర్టర్ మాక్‌లైవ్..వీడియో వైరల్..నెటిజన్ల ఫిదా..!
Also read:IND vs PAK: కఠినమైన పరిస్థితుల్లో సంయమనంతో ఆడారు..టీమిండియా ఆటగాళ్లపై గంగూలీ ప్రశంసలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి