CM KCR Inaugurates BRS Party Central Office: ఢిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రాభించారు. వసంత్‌ విహార్‌లో బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయాన్ని నిర్మాణం పూర్తవ్వడంతో గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లో ఆశీనులయ్యారు కేసీఆర్. ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయం ప్రారంభానికి ముందు ఆవరణలో బీఆర్ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. మరో రెండు రోజులు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రతిపక్ష నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అయ్యే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. అందుకే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి దేశవ్యాప్తంగా విపక్ష నేతలతో సమావేశం అవుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు నిర్వహించి.. ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్‌కు అధికారం కట్టబెట్టాలని కోరారు.


ఇక ఢిల్లీలో నిర్వహించిన బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయ భవనానికి 2021 సెప్టెంబర్‌ 2న భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. 11 వేల చదరపు అడుగుల స్థలంలో 4 అంతస్తులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. జీ ప్లస్ త్రీగా నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటేలా ఏర్పాట్లు చేశారు. క్యాంటీన్, రిసెప్షన్, నాలులు ప్రధాన కార్యదర్శుల చాంబర్లను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించారు. కేసీఆర్ చాంబర్‌ను ఫస్ట్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడే కాన్ఫరెన్స్‌ హాల్స్‌తోపాటు ఇతర చాంబర్లను నిర్మించారు. పైన 2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఏర్పాలు చేశారు. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌లకు రెండు రూమ్‌లు కేటాయించారు.  


తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని.. ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. 9 మంది లోక్‌సభ ఎంపీలతో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో, 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణమని.. సీఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయన్నారు.


Also Read: KKR Squad Update: కేకేఆర్ జట్టులోకి హార్డ్ హిట్టర్ ఎంట్రీ.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!


Also Read: SRH vs KKR Dream 11 Team Tips: సొంతగడ్డపై కేకేఆర్‌తో హైదరాబాద్ పోరు.. డ్రీమ్ 11 టిప్స్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎవరంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook