జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ మరో ముందడుగు.. ముగ్గురు కీలక నేతలను కలిసేందుకు ప్లాన్ ?
జాతీయ రాజకీయాల్లో మరో కొత్త ప్రత్యామ్నాయం తీసుకొచ్చి, కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని గతంలోనే ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో భాగంగానే ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో పర్యటించి అక్కడి కీలక నేతలను కలిశారు. జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌పై అసంతృప్తితో వున్న పలువురు నేతలను కలిసి వారిని తమతో కలిసి రావాల్సిందిగా కోరిన కేసీఆర్ తాజాగా ఒడిశా వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఒడిషా వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అవనున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో మరో కొత్త ప్రత్యామ్నాయం తీసుకొచ్చి, కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని గతంలోనే ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో భాగంగానే ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో పర్యటించి అక్కడి కీలక నేతలను కలిశారు. జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌పై అసంతృప్తితో వున్న పలువురు నేతలను కలిసి వారిని తమతో కలిసి రావాల్సిందిగా కోరిన కేసీఆర్ తాజాగా ఒడిశా వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఒడిషా వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అవనున్నారని తెలుస్తోంది.
నవీన్ పట్నాయక్‌తో భేటీలో ప్రస్తుత జాతీయ రాజకీయాలతో పాటు, ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించి, ఆయనను ఫ్రంట్‌లో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం. నవీన్ పట్నాయక్‌తో భేటీ తర్వాత మరుసటి రోజు కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో సమావేశం కానున్నారని సమాచారం.