హైదరాబాద్: 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి క్రితమే గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన అదే వేదికపై నుంచి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత గత ఐదేళ్లలో మనం చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని చెబుతూ... గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థికాభివృద్ది సైతం రెట్టింపు అయ్యిందని అన్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో 95 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించామని కేసీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని, ప్రజలకు కనీస జీవన భదత్ర కల్పించామని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందని ధీమా వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"179462","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ప్రస్తావిస్తూ.. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గిరిజన తండాలు, ఆదివాసీగూడెంలను పంచాతీయలుగా ప్రకటించామని అన్నారు.