తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండో అక్క పి. విమలాబాయి బుధవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయస్సు 82 ఏళ్లు. సోదరి విమలా బాయి పార్థివదేహానికి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, ఎంపీ కవితతో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం తిరుమలగిరిలోని శ్మశానవాటికలో విమలాబాయి అంత్యక్రియలు ముగిశాయి. 


కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న కాగా ఇప్పుడు చనిపోయిన సోదరి ఆయనకు రెండో అక్క అవుతారు.