CM Revanth Media Conference In Hyderabad: మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హజరవ్వాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత  అందరు అసెంబ్లీ సమావేశాలకు రావాలని రేవంత్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్రాజెక్టులపై విడుదల చేసిన శ్వేత పత్రాలపై చర్చించేందుకు సిద్ధామా అని రేవంత్ సవాల్ విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Palu Kobbari Payasam: పాలు, కొబ్బ‌రితో పాయ‌సం.. తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది !


మీకు పూర్తి అవకాశం ఇస్తాం... ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం..రెండు రోజులు చాలవంటే సమావేశాలను పొడగిద్దామంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ఎవరూ ద్రోహి.. ఎవరూ ప్రజలకు అన్యాయం చేశారో అందరి ముందే తెలిసిపోతుందన్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాలు కొట్టకుండా హజరవ్వాలని సీఎం రేవంత్ మండిపడ్డారు.  కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. 


అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా , గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత అని సెటైర్ వేశారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడని ఎద్దెవాచేశారు.


దీనికి అప్పటి.. టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి మరీ చట్టాన్ని ఆమోదింపజేశారన్నారు. దీనికి ముమ్మాటికి బాధ్యులు కేసీఆర్, కె.కేశవరావు అన్నారు. 
ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే.. 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు.


2015 జూన్ 18న KRMB సమావేశం నిర్వహించిందన్నారు. దీనిలో.. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారు. తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు.


Read More: Sreemukhi: తలలో మల్లెపూలతో మత్తెక్కిస్తోన్న శ్రీముఖి.. ఇది మాములు డోస్ కాదండోయ్..


కృష్ణా నది 68శాతం తెలంగాణలో ఉంది.. 32శాతం మాత్రమే ఏపీలో ఉంది. అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి. కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి మండిపడ్డారు.