Rahul Gandhi Night Club Video: కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ మే6న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల రాహుల్ పర్యటనకు టీపీసీసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ సభకు అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది రాహుల్ గాంధీ సభకు హాజరవుతారని టీకాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ నేతలను సభ కోసం సన్నదం చేస్తున్నారు. రాహుల్ టూర్ విజయవంతానికి పీసీసీ నేతల వర్గపోరు వీడి కలిసికట్టుగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఉప్పు నిప్పులా ఉన్న రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి రాహుల్ సభ ఏర్పాట్లను కలిసికట్టుగా పర్యవేక్షిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్ టూర్ తో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ వచ్చిందనే టాక్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంతలోనే బయటికి వచ్చిన రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోందని తెలుస్తోంది. రాహుల్ నైట్ క్లబ్ వీడియోపై దేశ వ్యాప్తంగా రచ్చ సాగుతోంది. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా రాహుల్ టూర్ రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వివాదం రేపుతోంది. తాజా ఘటనతో టీఆర్ఎస్ నేతలు మరింత స్పీడ్ పెంచారు .రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రాహుల్ తీరును ఎండగడుతూ.. కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు. తాజా ఘటనలు తెలంగాణ కాంగ్రెస్ ను పరేషాన్ చేస్తున్నాయని అంటున్నారు.


రాహుల్ గాంధీ పర్యటనకు ముందు నైట్ క్లబ్ వీడియో బయటికి రావడం తమకు ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. రాహుల్ వీడియోలో అసభ్యకరం ఏదీ లేదంటూ పైకి కవరింగ్ ఇస్తున్నా... లోలోపన మాత్రం తమకు ఇబ్బంది తెచ్చిందనే వాదనే మెజార్టీ పీసీసీ నేతల నుంచి వినిపిస్తోంది. వరంగల్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశామని.. నేతలు కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారని.. తాజా ఘటనతో అందరిలోనూ నిరాశ నెలకొందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ వచ్చినా తమకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పీసీసీ  నేతలు మాత్రం రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉంటాయని.. రాహుల్ గాంధీ సభకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతుండగా.. పీసీసీ నేతల్లో మాత్రం గుబులు రేపుతోంది.  


మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. రాహుల్ గాంధీ పెళ్లికి పోతే తప్పేంటని ఆయన ట్వీట్ చేశారు. గతంలో బీజేపీ నేతలు పబ్ లకు వెళ్లిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు.


 



తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెెంట్ జగ్గారెడ్డి కూడా రాహుల్ కు మద్దతుగా మాట్లాడారు. రాహుల్ వీడియోలో అసభ్యకరం ఏమి లేదన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన విజయవంతం అవుతుందని జగ్గారెడ్డి చెప్పారు.


READ ALSO: Rahul Night Club Video: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీక్... నేపాల్‌లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత..?


Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్? ప్రత్యామ్నాయ శక్తి ఇదేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.