Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధాన్యం కొనుగోలు(Paddy Procurement) విషయమై తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం, సందిగ్దత ఇంకా కొనసాగుతోంది. ధాన్యం కొనుగోలు విషయమై తేల్చుకునేందుకు తెలంగాణ టీఆర్ఎస్ నేతలు మరోసారి ఢిల్లీకు వెళ్లారు. ఈ వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ నుంచి ఖాళీ చేతులతో తిరిగొస్తే గాజులు, చీరలు పంపుతామని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు వీధి నాటకాలేస్తున్నారని విమర్శించారు. గత మూడు నెలలుగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నా..ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. వరంగల్ గోదాములోని 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్‌మాల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే..దొంగల్లా పారిపోయి వచ్చారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. సెంట్రల్ హాలులో ఫోటోలు దిగి..ఆందోళన చేసినట్టుగా ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రధాని నరేంద్ర మోదీని కలవకుండానే తిరిగొచ్చేశారన్నారు.


ఖరీఫ్‌లో ఇస్తామన్న పంటను ఇప్పటి వరకూ ఎందుకివ్వలేదనే కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిల్లీలో ఉన్న మంత్రులు, ఎంపీల బృందంలో కేటీఆర్, సంతోష్‌లు ఎందుకు లేరో చెప్పాలన్నారు. ఓ వైపు రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే..ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేకంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీన ఎర్రవెల్లిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులంతా ఆ రచ్చబండకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతుల సమక్షంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకాల్ని బహిర్గతం చేస్తామన్నారు. 


Also read: Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి.. ఇది టీఆర్ఎస్ గూండాల పనే అంటున్న మల్లన్న


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి