Telangana Congress Leader Kuna Srisailam Goud Likely To Join BJP: కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ, బీజేపీలో చేరనున్న కూన శ్రీశైలం గౌడ్!
తెలంగాణలో బలమైన ప్రతిపక్షమైన పార్టీ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు, ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కొందరు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) ఎలక్షన్స్ ఫలితాలతో నిరాశ చెందిన మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాడు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కొంతకాలం నుంచి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. మరికొందరు నేతలు సైతం తమ ఎటో తేల్చుకునేందుకు యోచిస్తున్నారు.


Also Read: Traffic Rules: ఇకనుంచి జరిమానాలు ఉండవు, ఏకంగా Driving License శాశ్వతంగా రద్దు


ఈ నేపథ్యంలో పార్టీని వీడవద్దని సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించనట్లు తెలుస్తోంది. నేటి (ఫిబ్రవరి 21న) ఉదయం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కూన శ్రీశైలం గౌడ్ కొందరు బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత రానుంది.


Also Read: DA Hike Latest News: డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook