తెలంగాణ కాంగ్రెస్ మరో పెద్ద  షాక్ తగిలింది. ఇప్పటికే పలవురు పార్టికి చెందిన ఎమ్మెల్యేలు,  సీనియర్ నేతలు పార్టీకి గుడ్ చెప్పిన షాక్ నుంచి తేరుకునే లోపే ..మరో వాయిస్ ఉన్న నేత, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్... పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. అయితే పొన్నం రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా 140 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. పీసీసీ, ఏఐసీసీ లాంటి కీలక పోస్టుల్లో ఉన్న నేతలు సైతం రాజీనామా లేఖలను నేరుగా రాహుల్‌కు పంపించారు. పార్టీ ఘోర పరాజయానికి ఎవరూ రాజీనామా చేయరా ? అని సాక్షాత్తూ రాహుల్ గాంధీయే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కొక్కరుగా తమ పదవుల నుంచి వైదొలుగుతున్నారు.కాగా పొన్నం విషయానికి వస్తే పార్టీ తీరుపై అసంతృప్తితో ఆయన రాజీనామా చేశారా ? లేదంటే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా అనేది తేలాల్సి ఉంది.