TPCC Chief Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. 11 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్ అంబాసిడర్లు అని..ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం కేసీఆర్ మాయలోడని..ప్రజలకు మోసం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మద్యంతోనే ప్రజలను చిత్తు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని..అది మరోసారి నిరూపితం అవబోతోందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌తో రైతుల బతుకుల్లో చీకట్లు అలుముకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. 


రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. దేశంలో వంద శాతం డిజిటల్ మెంబర్ షిప్‌ చేసిన ఘనత తెలంగాణకు దక్కుతుందన్నారు రేవంత్‌రెడ్డి.  60 రోజుల్లో 30 లక్షల డిజిటల్ మెంబర్‌ షిప్‌ చేశామని..మరో నెల రోజుల్లో 42 లక్షల మెంబర్‌ షిప్‌ ఇస్తామన్నారు. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉందని..మర్రి చిన్నారెడ్డి విషయంలో ఇదే జరిగిందని తెలిపారు. 


డిజిటల్ మెంబర్ షిప్‌ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు రేవంత్‌రెడ్డి. ప్రతి కార్యకర్త ఇలాగే పని చేయాలని..పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ డిజిటల్ మెంబర్ షిప్‌ ఛైర్మన్ ప్రవీణ్‌ చక్రవర్తి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.



 


Also read:Minor Rape Victim: రెచ్చిపోతున్న కామాంధులు..హైదరాబాద్‌లో మరో దారుణం..!


Also read:CM Jagan Review: ఏపీలో అక్టోబర్‌ 2న మరో నవశకం..అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook