Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు ముఖ్య నేతలు ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారని గాంధీ భవన్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ నేతలు చాలా హడావుడి చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారంలో కూడా  చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు.అలాంటి నేతలు ఈ మధ్య ఎందకు సైలెంట్ అయ్యారని పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కూడా ఉండడంపై అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై తెల్లార్లు లేచింది మొదలు ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటుంటే ఈ నేతలు మాత్రం కనీసం స్పందించకపోవడం ఏంటా అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 గతంలో ఈ నేతలు బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోను వీరు బీఆర్ఎస్ పై విమర్శలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాంటి నేతలు ఇప్పుడు సడన్ గా కామ్ గా మారడం కాంగ్రెస్ పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అధికారంలోకి వచ్చాక ఇంకా పార్టీ కోసం మరింత యాక్టివ్ గా పని చేయాల్సిన నేతలు ఎందుకు ఇన్ యాక్టివ్ అయ్యారని మీడియా సర్కిల్ లో కూడా టాక్ నడుస్తుంది. ఇటీవల హైడ్రా, రుణమాపీ లాంటి అంశాల్లో బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసిన ఈ నేతలు మాత్రం కనీసం స్పందించకపోవడంపై కాంగ్రెస్ శ్రేణులనే విస్మయానికి గురి చేస్తున్నాయి.


ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న వారిలో కొందరి పేర్లు ప్రముఖుంగా వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో రాజ్యసభ సభ్యురాలు  రేణుకా చౌదరి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు విజయశాంతి పేరు కూడా వినబడుతుంది. అసలు వీరి సైలెన్స్ వెనుక ఉన్న కారణమేంటి అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదంట. కానీ వీరిలో కొందరు పదవుల విషయంలో అసంతృప్తిగా  ఉండగా మరి కొందరు తమ నియోజకవర్గాల్లో నెలకొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా  మౌనంగా ఉంటున్నారని ఆ నేతల అనచరుల నుంచి వస్తున్న సమాధానం.


ఐతే రేణుకా చౌదరికి ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార పార్టీపై విరుచుకుపడేది అలాంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా రేణుకా ఇన్ యాక్టివ్ గా మారడంపై రకరకాల ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది అలాంటి రేణుకా చౌదరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి దానికి తోడు ఎంపీ గా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తన మాట పెద్దగా చెల్లడం లేదని తెగ బాధపడిపోతుందంట. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులదే హవా నడుస్తుండడంతో రేణుకా చౌదరి అనచరవర్గం పూర్తిగా సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. 


ఇక మాజీ మంత్రి షబ్బీర్ అలీదీ మరొక సమస్య. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు బాగానే యాక్టివ్ గా ఉండేవారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పై ఎవరు విమర్శలు చేసినా ప్రెస్ మీట్ లు పెట్టి అపోజిషన్ వారిపై విరుచుకుపడేవారు. అలాంటిది షబ్బీర్ అలీ కూడా ఈ మధ్య పెద్దగా మీడియాలో యాక్టివ్ గా ఉండటం లేదు. ఐతే షబ్బీర్ అలీ అనచరుల వద్ద ఈ విషయం ఆరా తీయగా మా నాయకుడు చాలా సీనియర్ అందునా కాంగ్రెస్ కు విధేయుడు. మైనార్టీ కోటా కింద మంత్రి పదవి ఇవ్వాల్సింది. కానీ అధిష్టానం ఎందుకు అటు వైపుగా ఆలోచించడం లేదనే చెప్పుకుంటున్నారు.


ఇక మరో ముఖ్య నేత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు అందరికీ తెలసిందే.అసెంబ్లీ ఎన్నికల మొదలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకు రాజగోపాల్ రెడ్డి నానా హంగామా చేశారు. కానీ అలాంటిది కొద్ది నెలలుగా రాజగోపాల్ రెడ్డి అడపాదడపా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అంతే కాదు తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని భీష్మించుకు కూర్చున్న సంగతి తెలసింది..ఇప్పటికే చాలా బహిరంగ సమావేశాల్లో తనక పలానా శాఖ కావాలంటూ కూడా మనసులో మాట వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. అలాంటి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ లో తెగ చర్చ జరగుతుంది.


ఇక జీవన్ రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. సంజయ్ చేరికను జీర్ణించుకోలేని జీవన్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా పాల్గొనడం లేదనే ప్రచారం జరుగుతుంది.


వీరితో పాటు మరి కొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ నేతల సమస్య ఏంటీ..ప్రభుత్వం, పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాల్సిన నేతలు ఇలా సైలెంట్ గా ఉండడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అధిష్టానం కూడా ఇలాంటి నేతలను పిలిపించుకొని వారితో మాట్లాడి పార్టీ కోసం పనిచేసేలా చూడాలనే చర్చ కూడా జరుగుతుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.