Telangana CoronaVirus cases: కొత్తగా 612 కరోనా కేసులు
Telangana CoronaVirus cases Updates: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 612 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Telangana CoronaVirus cases: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న (గురువారం) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో 612 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516కి చేరింది.
నిన్న ఒక్కరోజే 56,178 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణ (Telangana)లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,485కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 502 మంది చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,67,427 మంది కోలుకున్నారు.
Also Read : Jana Reddy: నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్‌పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రస్తుతం 7,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 5,511 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కరోనా రికవరీ రేటు జాతీయ సగటు కన్నా తెలంగాణ మెరుగ్గా ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) రికవరీ రేటు 96.71 శాతం ఉండగా, జాతీయ సగటు 94.8శాతానికి చేరింది.
Also Read : Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe