Telangana Coronavirus: రాష్ట్రంలో 4,524 కరోనా యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనావైరస్ కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నిత్యం 500లకు తక్కువగా నమోదవుతున్నాయి.
Coronavirus Telangana Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నిత్యం 500లకు తక్కువగా నమోదవుతున్నాయి. గత 24గంటల్లో (జనవరి 11న) సోమవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 301 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,90,309 కి చేరగా.. మరణాల సంఖ్య 1,568 కి పెరిగింది.
ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 293 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,84,217 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,524 యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also Read: Covishield: రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ రవాణా
రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97.90 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతం ఉంది. నిన్న (Telangana) రాష్ట్రంలో 34,431 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 11వ తేదీ వరకు మొత్తం 73,12,452 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: Telangana: తొలి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook