Telangana CPGET 2022 Results released: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) 2022 ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ సీపీగెట్‌ 2022 ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు దాదాపుగా 57 వేల మంది హాజరు కాగా.. 54,050 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 94.39శాతం ఉత్తీర్ణత నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 11 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 57,262 మంది హాజరు కాగా.. 54,050 మంది ఉతీర్ణత పొందారు. ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలో 94.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని 8 వర్సిటీల పరిధిలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌, పీజీ డిప్లమా కలిపి 50 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. 


సీపీగెట్‌ 2022 ఫలితాలు ఇలా తెలుసుకోండి:
# సీపీగెట్‌ 2022 ఫలితాల కోసం cpget.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
# హోమ్‌పేజీలో CPGET 2022 ర్యాంక్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. 
#  ర్యాంక్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. హల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయండి. 
# అప్పుడు మీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. 
# ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.
Also Read: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు: చిరంజీవి


Also Read: Liger OTT: ఓటీటీలోకి లైగ‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులోనో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.