మేడారం జాతరకు యూనెస్కో గుర్తింపు దక్కాల్సిందే
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కితాబునందుకుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ జాతరకు యూనెస్కో గుర్తింపు దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని ఆమె తెలిపారు.
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కితాబునందుకుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలియజేశారు. అంతటి ప్రతిష్టాత్మకమైన ఈ జాతరకు యూనెస్కో గుర్తింపు దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషిచేయాలని ఆమె తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరగిందని ఎంపీ కవిత తెలియజేశారు. కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ విభాగంలో యునెస్కో గుర్తించిందని సుష్మా స్వరాజ్ ఇటీవలే తన ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. ఆ ట్వీట్‌కు అభినందనలు తెలిపిన కవిత, మేడారం జాతరను కూడా యూనెస్కో గుర్తించేలా కృషి చేయాలని కోరారు.
వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అడవి ప్రాంతమైన మేడారంలో కొండ కోనల మధ్య మేడారం జాతర అనేది జరగడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మలను స్మరించుకుంటూ జరిపే ఈ జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి దేవతలను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయములో కొందరు భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే ఈ కార్యక్రమాలకు పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత.