Telangana DGP: పోలీసు కంటే మంచి స్నేహితుడు ఎవరుంటారు
మన ప్రతీ అవసరంలో స్పందించే.. పోలీసు కంటే మంచి స్నేహితుడు ఎవరుంటారు.. అని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy ) పేర్కొన్నారు.
Friendship Day Greetings: హైదరాబాద్ : మన ప్రతీ అవసరంలో స్పందించే.. పోలీసు కంటే మంచి స్నేహితుడు ఎవరుంటారు.. అని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ( Mahender Reddy ) పేర్కొన్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా డీజీపీ ట్విట్టర్ ద్వారా తెలంగాణ ( Telangana ) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ విధంగా రాశారు. Also read: Covid-19: తెలంగాణలో కొత్తగా 1,891 కేసులు..
‘‘మన ప్రతి అవసరంలో స్పందించేవాడు. మన భద్రత, రక్షణ గురించి ఎల్లప్పుడూ ఆలోచించేవాడు. మనకోసం తన జీవితాన్ని పణంగా పెట్టేవాడు. చట్టానికి, సమాజానికి కట్టుబడి ఉండేవారికి పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండగలరా..’’ అంటూ డీజీపీ ట్విట్టర్‌లో స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే డీజీపీ చేసిన ఈ పోస్టు పలువురిని ఆకట్టుకుంటోంది. Also read: CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం