Telangana DSC 2024 Key: తెలంగాణ నిరుద్యోగులు ఎంతోగానో ఎదురుచూసిన డీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలోని 11,062 ఉపాధ్యాయ ఖాళీ భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. పరీక్ష ఫలితాలు చెక్‌ చేసుకోవడంతోపాటు డీఎస్సీ పరీక్ష సమగ్ర వివరాలు తెలుసుకోండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: HYDRAA Bandi Sanjay: నా ప్రాణం తీశాకే 'హైడ్రా' పేదోళ్ల ఇళ్లు కూల్చాలి: బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు


సచివాలయంలో విద్యా శాఖ తన వద్ద ఉంచుకున్న రేవంత్‌ రెడ్డి సోమవారం ఫలితాలను విడుదల చేశారు. మార్చి 2024లో డీఎస్సీ ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. 33 జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పరిశీలన పూర్తయిన అనంతరం ఒక్కో పోస్టుకు ముగ్గురు (1:3) చొప్పున జాబితా రూపొందిస్తారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి తుదిగా ఎంపికైన వారిని తుది జాబితా విడుదల చేస్తారు. అనంతరం ఎంపికైన వారికి ముఖ్యమంత్రి స్వయంగా నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది.


చెక్‌ చేసుకోవడం ఇలా..


  • ఫలితాల కోసం https://tgdsc.aptonline.in/tgdsc/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

  • టీజీ డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ అనే ఎంపికపై క్లిక్‌ చేయాలి.

  • మీ జిల్లాను ఎంచుకోవాలి.

  • సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా అక్కడ కనిపిస్తుంది.

  • తుది ఎంపికకు ఎంపికైన వారి జాబితా ధ్రువపత్రాల పరిశీలన తర్వాత అందుబాటులో ఉంటుంది.


పోస్టుల వివరాలు ఇవే..


  • ఎస్జీటీలు 6,508

  • స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629

  • భాషా పండితులు 727

  • పీఈటీలు 182

  • ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796


డీఎస్సీ పరీక్షలు ఇలా
రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా.. ఈ పోస్టులకు మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ మధ్య జరిగిన పరీక్షల్లో 2,45,263 మంది రాశారు. 34,694 మంది గైర్హాజరవగా.. హాజరైన అభ్యర్థుల శాతం 87.61 శాతంగా నమోదైంది. సీబీఆర్‌టీ పద్ధతిలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.