TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ TS EAPCET 2024 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్  https://eapcet.tsche.ac.in/లో  అందుబాటులో ఉన్నాయి. మొన్న సోమవారం నాడు అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లు, నిన్న ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో మే 7 నుంచి మే 11 వరకూ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఈఏపీసెట్ పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా 3.54 లక్షలమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి టీఎస్ ఈఏపీసెట్ 2024 దరఖాస్తు గడువు ముగిసినా 5000 జరిమానా చెల్లించి ఇవాళ కూడా అప్లై చేసుకునేందుకు వీలుంది. ఈ ఏడాది ఈఏపీసెట్ పరీక్షల్ని హైదరాబాద్ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలు, ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి ఈఏపీసెట్ 2024 విధిగా రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ర్యాంక్ ఆధారంగా వివిద కళాశాల్లలో సీటు లభిస్తుంది. 


తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్ టికెట్ల కోసం ముందుగా  https://eapcet.tsche.ac.in/  ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై‌ కన్పించే హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. చివరిగా గెట్ హాల్ టికెట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతుంది. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి. మొత్తం  3.54 లక్షల మంది విద్యార్ధులు ఈఏపీసెట్ పరీక్షలు రాయనుండగా ఇంజనీరింగ్ విభాగానికి 2.54 లక్షలమంది, అగ్రికల్చర్, ఫార్మసీకు 1 లక్ష మంది ఉన్నారు. 


Also read: Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో దేశం గర్విస్తే.. 'ఆర్‌' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook