Telangana Inter Results 2023: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన నెలరోజులు దాటేసింది. లక్షలాదిమంది విద్యార్ధులు ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఆలస్యంగానైనా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇంటర్ ఫలితాల్ని విడుదల చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5 వరకూ జరిగాయి. ఏపీలో కూడా ఇదే తేదీన పరీక్షలు జరిగాయి. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెల్లడై అప్పుడే 13 రోజులు కావస్తున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం ఇవాళ మరి కాస్సేపట్లో 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 9.47 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది ఇంటర్ ఫలితాలు జూన్ నెలలో విడుదల కాగా, ఈ ఏడాది ఓ నెల ముందుగానే విడుదల చేస్తున్నారు. వ్యాల్యుయేషన్ అనంతరం ఫలితాల క్రోడీకరణ, ట్రయల్స్ పూర్తయ్యాక మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించారు. ఆ తరవాత ఫలితాల విడుదలకు అనుమతి లభించింది. 


రాష్ట్రవ్యాప్తంగా 9.47 లక్షలమంది ఇంటర్ పరీక్షలు రాయగా ఇందులో మొదటి సంవత్సరం విద్యార్దులు 4,82,501 మంది ఉంటే, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 4,23, 901 మంది ఉన్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ రెండవ వారానికే పూర్తయినా డీ కోడింగ్, సమీకరణ ప్రక్రియలకు ఆలస్యమైంది. విద్యార్ధులు ఫలితాల కోస నేరుగా దిగువన ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.


1.https://tsbie.cgg.gov.in
2. https://results.cgg.gov.in

3. examresults.ts.nic.in
3. https://www.manabadi.com/


ఇంటర్ పరీక్ష ఫలితాల్ని చెక్ చేసుకోవడం చాలా సులభం. పైన ఇచ్చిన ఏదైనా లింక్ ఓపెన్ చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.


Also read: Ap Government: ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త వేదిక, జగనన్నకు చెబుదాం ఇవాళే ప్రారంభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook