Coronavirus: సెలవులు మీకు కాదు వారికి మాత్రమే...
ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకాకపోవడంపై విద్యా శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అసంతృప్తి
హైదరాబాద్: ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ Coronavirus చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకాకపోవడంపై విద్యా శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. విద్యార్థులకు సెలవులు ప్రకటించిందని ఉపాధ్యాయులకు కాదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దోషులు అత్యున్నత న్యాయస్థానానికి..
ఈ సందర్భంగా జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు యథావిధిగా పాఠశాలలకు వెళ్లాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన శాఖాపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పదోతరగతి పరీక్షల విధులు నిర్వహించే వారు విధులకు హాజరుకావాలని, మిగిలిన వారు పాఠశాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read Also: కరోనా కట్టడికి మరో కఠిన నిర్ణయం తీసుకున్న కేంద్రం