Telangana Exit Poll 2023 Update; ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఎన్ని గంటలకంటే
Telangana Exit Poll 2023 Date and Time Update : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో చివరి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణ పోలింగ్ ముగియగానే మొత్తం ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం నుంచి సందడి చేయనున్నాయి.
Telangana Exit Poll 2023 Date and Time Update: ఇవాళ మరి కాస్సేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పోలింగ్ ముగుస్తూనే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు వివిధ సర్వే సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. మిగిలిన చివరి తెలంగాణ ఎన్నికలు కూడా కాస్సేపట్లో ముగియనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఉద.యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాలైన 13 స్థానాల్లో మాత్రం గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. తెలంగాణ పోలింగ్ ముగియగానే మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి చేసేందుకు వివిధ సర్వే సంస్థలు నిరీక్షిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్పులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇవాళ వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ముగిసిన అరగంట తరువాత అంటే సాయంత్రం 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ప్రకటించింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సాయంత్రం 6.30 గంటల తరువాతే విడుదల చేయాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పుడీ సమయంలో మార్పు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ గడువును సవరించడంతో ఇవాళ సాయంత్రం 5.30 గంటల నుంచి వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ హల్‌చల్ సృష్టించనున్నాయి.
ప్రీ పోల్ సర్వే కంటే ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు దాదాపు దగ్గరగా ఉండే అవకాశాలుండటంతో ఏ సంస్థ సర్వే ఏం చెబుతుందోననే ఆసక్తి రేగుతోంది. ఓటింగ్ శాతాన్ని బట్టి కూడా ఫలితాలు నిర్ధేశింపబడే అవకాశాలున్నందున సాయంత్రం వరకూ నిరీక్షించిన తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook