TS Elections Polls 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్ దంపతులు..
TS Elections Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా పోలింగ్ ముగిసే సమయానికి మహష్ బాబు, రామ్ చరణ్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
TS Elections Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడతలో తెలంగాణ, ఏపీ సహా 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామన్ పీపుల్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తెలంగాణ ఛీప్ కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేటీఆర్ సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినిమా వాళ్లలో చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు సహా పలువురు సినీ ప్రముఖులు ఈ ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తన ఓటు వినియోగించుకున్నారు.
TS Elections Polls 2024
అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి జూబ్లీహిట్స్ క్లబ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అటు హీరో నాని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు పలువురు సెలబ్రిటీలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాల్గో విడతతో దేశ వ్యాప్తంగా 379 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో మూడు విడతల్లో 164 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Also read: Voter Slip: ఓటరు స్లిప్ అందకున్నా నో ప్రాబ్లెమ్, ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter