Telangana Election Result 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు అధికార బీఆర్ఎస్ పార్టీకు షాక్ ఇచ్చాయి. మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తామన్న ధీమాతో ఉన్న పార్టీకు తెలంగాణ ప్రజలు నిరాకరించారు. మార్పును కోరుకుని కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టారు. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో విలక్షణ తీర్పును ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంంగాణ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఇప్పటికే 27 స్థానాల్లో విజయం సాధించగా 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే 39 స్థానాలకు పరిమితం కానుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 62 స్థానాల్లో విజయం సాధించగా మరో రెండింట్లో లీడ్ కొనసాగిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి అదనంగా మరో 4 స్థానాలు సాధించనుంది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా మజ్లిస్ పార్టీ రెండింట గెలవగా 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన 7-8 మంత్రులు ఓడిపోయారు. మరోవైపు బీజేపీ ఈసారి 8 స్థానాలు గెల్చుకున్నా సరే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, దుబ్బాక రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వంటి కీలక నేతలు ఓడిపోయారు. 


అన్నింటికీ మించి షాకింగ్ పరిణామం కామారెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున కేసీఆర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ పడ్డారు. అదే సమయంలో బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి బరిలో నిలిచారు. సాధారణంగా కామారెడ్డిలో కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారని అంతా ఊహించారు. కానీ అనూహ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్ధుల్ని ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు వెంకట రమణారెడ్డి. 


కామారెడ్డి ప్రజలు అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డిని స్థానికేతరులుగా పరిగణించి నిరాకరించినట్టు అర్ధమౌతోంది. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వెంకట రమణారెడ్డిని గెలిపించుకున్నట్టు తెలుస్తోంది.కేసీఆర్‌ను ఓడిస్తానని సవాలు చేసి బరిలో దిగిన రేవంత్ రెడ్డికి కూడా కామారెడ్డి ప్రజలు షాక్ ఇచ్చారు. ఎందుకంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు. కేసీఆర్‌పై వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 


Also read: KTR Tweet: తెలంగాణ ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీకు అభినందనలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook