Telangana Employees: ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అధికారులపై రైతులు తిరగబడిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కలెక్టర్‌పై మహిళ చేయి చేసుకోవడం.. కార్లు ధ్వంసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అధికారులకే భద్రత లేకుండా పోతే ఎలా? అని ప్రశ్నించాయి. వికారాబాద్‌ సంఘటన ప్రభుత్వ ఉద్యోగులను భయాందోళనకు గురి చేశాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kukatpally: రేవంత్‌ రెడ్డినే రమ్మంటూ సర్వే అధికారులకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్లాస్‌


 


వికారాబాద్ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఇతర అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లగా ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై డిజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Also Read: KTR: అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. కేటీఆర్‌ కన్నీటిపర్యంతం


 


అధికారులపై దాడికి ఉసిగొల్పిన.. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరతామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తే కొందరు అధికారులపై దాడులు చేశారని.. వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి దాడులతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.


ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బలవంతంగా ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అనుమతించడంతోపాటు భూసేకరణ చేపడుతుండడంతో గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్నిసార్లు స్థానక అధికారులపై దాడి జరగ్గా.. తాజాగా ఉన్నత అధికారులపైనే దాడి జరగడం గమనార్హం. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మొండి పట్టుదలతో ముందుకు వెళ్లడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు దాడికి పాల్పడడం చూస్తుంటే ప్రజలు ఆ కంపెనీకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి