Telangana: పొంగులేటి బీజేపీ చేరిక ఖాయమే, బీజేపీ నేతలతో కీలక భేటీ
Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ టు బీజేపీ వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కాషాయతీర్ధం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరం చేస్తున్నట్టు అన్పిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో నేత బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇవాళ బీజేపీ కీలక నేతలతో సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విబేధించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం దాదాపుగా ఖరారైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్ధుల్ని అసెంబ్లీ గేట్లు సైతం తాకనివ్వనని శపథం చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి బలం చాటే ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీ నుంచి ఆహ్వానాలున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత పొంగులేటితోపాటు మాజీ మంత్రి జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు కాంగ్రెస్, బీజేపీలు చేశాయి.
వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరే విషయమై చాలాకాలంగా ప్రచారం జరుగుతున్నా పొంగులేటి ఆ విషయాన్ని నిర్ధారించలేదు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇవాళ ఆయనతో బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పొంగులేటిలో ఇవాళ భేటీ కానున్నారు. ఖమ్మం ఎంపీ సహా మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మద్దతుదారులకు సీట్లు ఇవ్వాలనేది పొంగులేటి డిమాండ్ అని తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణలో పార్టీలో చేరేవారి హామీలపై రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్ఛనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ పొంగులేటిని చేర్చుకునేందుకు ప్రయత్నించినా కొన్ని అంశాలు పెండింగులో ఉండిపోయాయి. దాంతో బీజేపీ మరోసారి రంగ ప్రవేశం చేసింది. అటు పొంగులేటి కూడా బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇవాళ్టి చర్చలు ఫలిస్తే త్వరలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగసభ ద్వారా బీజేపీలో చేరవచ్చని సమాచారం.
Also read: Minister KTR: హైదరాబాద్ నగరంలో వార్డు పాలన వ్యవస్థ.. త్వరలోనే శ్రీకారం: మంత్రి కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook