HYDRA: హైడ్రా స్పీడుకు కేసీఆర్ బ్రేకులు..
HYDRA: హైదరాబాద్‌లో హైడ్రా స్పీడ్‌కు బ్రేకులు పడబోతున్నాయా..! పేదల ఇళ్లు కూల్చివేతల్ని బీజేపీ అడ్డుకునేందుకు సిద్దమైందా..! కూల్చివేతలపై బీఆర్ఎస్ కూడా మరో పోరాటానికి సిద్దం అవుతోందా..! ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు రెండు పార్టీలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాయి.. మరి వీటిని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ రెడీ వ్యూహం సిద్ధం చేసుకుందా అంటే..
HYDRA: హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. నగరంలో చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టాడాలను హైడ్రా అధికారులు ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా నేలమట్టం చేస్తున్నారు. నగరం బాగు కోసం రేవంత్ చేస్తోన్న ఈ పనులపై ముందుగా సానుకూలత వ్యక్త్యం అయ్యాయి. రాను రాను ఇది రేవంత్ కు బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే వందల సంఖ్యలో నిర్మాణంలో ఉన్న భవంతులను హైడ్రా అధికారులు కుప్పకూల్చారు. ప్రస్తుతం నగరంలోని అనేక చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్న అధికారులు.. పెద్దలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేదల పక్షాన నిలిచేందుకు అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్ యాక్షన్‌ప్లాన్ సిద్దం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఇన్నాళ్లు తలోమాట మాట్లాడిన బీజేపీ నేతలంతా ఏకతాటి మీదకు వచ్చినట్టు తెలిసింది. హైడ్రా దూకుడుకు కళ్లం వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు బీఆర్‌ఎస్ పార్టీ కూడా న్యాయపరంగా బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది.
ఇక హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా తానుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయంలో 40 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టామని, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూకట్ పల్లి నియోజక వర్గంలో ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు. జీహెచ్ఎంసీ, బుద్ద భవన్, ఐమాక్స్, సెక్రటరేటిట్ లు అన్ని కూడా నాళాల పైనే ఉన్నాయని అన్నారు. మంత్రుల ఇళ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నాయని, ముందు వీటిని కూల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. హైడ్రా కూల్చివేతల్ని కొందరు నేతలు సమర్థిస్తే మరికొందరు నేతలు వ్యతిరేకించారు. కొందరు నేతలైతే హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నేతల మధ్య భిన్న వాదనలు కనిపించడంతో క్యాడర్ సైతం పరేషన్ అయ్యింది. ప్రస్తుతం నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలపై MP ఈటల సీరియస్ కామెంట్స్ చేశారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం అత్యం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్లతో షెడ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లి నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని తెలిసే కావాలనే కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీని ఇరుకునే పెట్టేందుకు బీజేపీ- బీఆర్‌ఎస్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా.. ప్రభుత్వ పెద్దలను ఎందుకు వదిలేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో పేదల పక్షాన నిలిచి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే హైడ్రాతో రాజకీయంగా తమకు లాభం జరుగుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ- బీఆర్‌ఎస్ పార్టీలను ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.