KCR In Assembly: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యేడాది పాలన పూర్తైయిన సందర్బంగా ప్రజా పాలన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. గత సంవత్సర  కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ప్రజల ముందుంచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ‌ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపడం, అప్పటి రుణాలను తీర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు గత ఏడాది కాలంలోని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం, హామీల అమలుపై నిలదీయడమే ఎజెండాగా ప్రతిపక్షాలు సభకు హాజరు కానున్నాయి. రైతు రుణమాఫీ జరిగిన తీరు, రైతు భరోసా ఇవ్వకపోవడం, ధాన్యం కొనుగోళ్లు, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహాలు పన్నుతోంది.


ఇక రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందంటూ చార్జిషీట్లు ప్రకటించిన బీజేపీ.. ఆయా అంశాలను, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించాలని కోరాలని ఎంఐఎం భావిస్తోంది.


శాసనసభ శీతాకాల సమావేశాల్లో ROR 2024 చట్టాన్ని   ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్‌వోఆర్‌–2020 చట్టానికి పలు సవరణలు చేసి దీనిని రూపొందించింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించనుంది. మహిళా యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన అనంతర కార్యాచరణ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ జరిగిన తీరును, రైతు భరోసా విధివిధానాలను అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లు, జెన్‌కో ప్రాజెక్టుల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సీఎం రేవంత్‌ ప్రకటన చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చి విలువైన సూచనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మొత్తంగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోయే విషయమై తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.