Governer Tamilsai: తెలంగాణ గవర్నర్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా గవర్నర్ ఎక్కడికి వెళ్లినా అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కాకుండా దిగువ స్థాయి అధికారులే ఆమెను రిసీవ్ చేసుకుంటున్నారు. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళి సైకి మరోసారి అవమానం జరిగింది. గవర్నర్ పర్యటనను పట్టించుకోలేదు కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులు. జిల్లాకు వచ్చిన గవర్నర్ స్వాగత కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ డుమ్మా కొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి రాత్రి రైలులో వెళ్లారు గవర్నర్ తమిళి సై. మణుగూరు చేరుకున్న గవర్నర్ కు అక్కడ ఆశ్వాపురం తహశీల్దార్ సురేష్, అడిషనల్ ఎస్పీ కేఅర్కే ప్రసాద్ స్వాగతం చెప్పారు. కాని గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం చెప్పాల్సి ఉంది. కాని వాళ్లిద్దరు గవర్నర్ ను రిసీవ్ చేసుకోలేదు. రాత్రి అశ్వాపురంలోని హెవీవాటర్ ప్లాంట్ విశ్రాంతి భవనంలో గవర్నర్ బస చేశారు. ఆదివారం ఆమె అశ్వాపురంలోని పాములపల్లి, చింతిర్యాలకాలనీతో పాటు పలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని పర్యవేక్షించి ముంపు బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు గవర్నర్. పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని రెడ్ క్రాస్ ప్రతినిధులను ఈఎస్ఐసీ వైద్యబృందాన్ని ఆదేశించారు గవర్నర్.


ఈ వారంలోనే నల్గొండ జిల్లాలో పర్యటించారు గవర్నర్ తమిళి సై, అయితే నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆమెకు స్వాగతం చెప్పలేదు. కార్యక్రమంలో పాల్గొనలేదుయ దాదాపు ఏడాదిగా గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు వచ్చాయి. 9 నెలల పాటు రాజ్ భవన్ వెళ్లలేదు కేసీఆర్. గవర్నర్ నిర్వహించిన అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. తెలంగాణ సర్కార్ తనను అవమానిస్తోందని తమిళి సై బహిరంగంగానే చెప్పారు. కేంద్రం పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే గత నెలలో రాజ్ భవన్ లో జరిగిన హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో గవర్నర్, సీఎం మధ్య గ్యాప్ తగ్గిందనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా జరుగుతున్న ఘటనలతో అది ఉత్తదేనని తేలిపోతుంది.


మరోవైపు కేంద్ర సర్కార్ డైరెక్షన్ లోనే గవర్నర్ వరద  బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని టీఆర్ఎస్ భావిస్తోంది. నిజానికి శనివారం సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్ని రాష్ట్రాల గవర్నర్లకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. కాని ఈ కార్యక్రమానికి తెలందాణ గవర్నర్ హాజరుకాలేదు. రాష్ట్రపతి విందును రద్దు చేసుకుని తమిళి సై భద్రాది జిల్లాకు వెళ్లడం వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తాజాగా జరుగుతున్న పరిణామాలతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య మరింత ముదరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Read also: Hyderabad Gun Shot: లారీ డైవర్ పై సినీ ఫక్కీలో కాల్పులు... హైదరాబాద్ లో కలకలం!  దారి దోపిడీ గ్యాంగ్ పనేనా? 


Read also: Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్‌.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ? 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook