Telangana Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా..? 1 లక్ష రూపాయలు గెల్చుకునేందుకు ఇదే మంచి అవకాశం
Telangana State Reels Contest: సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి రీల్స్ గురించి బాగా తెలుసు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఇదొకటి. రీల్స్ చేసేవారికి ఇప్పుడు ప్రభుత్వం సరికొత్త అవకాశం కల్పిస్తోంది. ఏకంగా లక్ష రూపాయలు నగదు బహుమతి సైతం ప్రకటించింది.
Telangana State Reels Contest 2023: ఇన్‌స్టా, ఫేస్‌బుక్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రత్యేకతలపై రీల్స్ చేసి పోస్ట్ చేస్తే 1 లక్ష రూపాయలు నగదు బహుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా వింగ్ పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రీల్స్ చేసేవారికి గొప్ప అవకాశం. మీ క్రియేటివిటీ నిరూపించుకునేందుకు ఇదే మంచి తరుణం. తెలంగాణ ప్రభుత్వమే మీ క్రియేటివిటీని గుర్తించే అవకాశం లభిస్తుంది. ఇన్‌స్టా గ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చేయడం వస్తే ఈ అవకాశం మీకే. మీరు చేయాల్సిందల్లా హైదరాబాద్ ప్రత్యేకతలపై రీల్స్ చేసి పోస్ట్ చేయడమే. నచ్చితే తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయలు నగదు బహుమతి అందిస్తుంది.
హైదరాబాద్ ప్రత్యేకతల కోసం నగరంలోని అద్భుత ప్రదేశాల్ని ఎంపిక చేసుకుని మంచి రీల్స్ చేసి @DigitalMediaTS ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తే చాలు. హైదరాబాద్ నగరం జీవనానికి ఎంత అనుకూలంగా ఉంటుందో నిరూపించేలా రీల్స్ ఉండాలి. ఒక్కొక్క రీల్ 60 సెకన్లు మించకూడదు. ఇతర నియమ నిబంధనల కోసం https://it.telangana.gov.in/contest/ లింక్ సంప్రదించాలి. ఏప్రిల్ 30 వరకూ గడువు తేదీ ఉంది.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో మౌళిక సదుపాయాల కల్పన పెరుగుతోంది. ఎక్కడకు వెళ్లినా ఎత్తైన ఫ్లై ఓవర్లు దర్శనమిస్తున్నాయి. ఐటీ కారిడార్ పూర్తి స్థాయిలో విదేశీ నగరాల లుక్ సంతరించుకుంది. హైదరాబాద్ అభివృద్ధి, ప్రత్యేకతలపై రీల్స్ చేసే కాంటెస్ట్ పెడితే మంచి ప్రచారం లభిస్తుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. dir_dm@telangana.gov.in కు మెయిల్ కూడా చేయవచ్చు.
మరింకెందుకు ఆలస్యం వెంటనే రంగంలో దిగండి. ఇంకా 26 రోజులు గడువుంది. హైదరాబాద్ ప్రత్యేకతలపై మంచి రీల్స్ చేసేందుకు ఈ సమయం సరిపోతుంది. హైదరాబాద్ నగరంలో జీవన విధానం ఎలా ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఎందుకు ఉంటుందనే వివరాల్ని పొందుపరుస్తూ రీల్స్ చేస్తూ ఆకట్టుకోవచ్చు.
Also Read: Netflix Password: మీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ ఎవరికైనా షేర్ చేశారా, జైలుశిక్ష తప్పదు
Also Read: KKR vs RCB Live Updates: కోల్‌కతా vs బెంగళూరు బిగ్ ఫైట్.. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook