Telangana School Uniforms: మరో నెలన్నర రోజుల్లో అంటే జూన్‌ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం డిజైన్ లో మార్పులను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేయడం జరిగింది. పాఠశాల విద్యా శాఖ మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికి కూడా కార్పొరేట్ స్టైల్ యూనిఫాం ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందుకోసం ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు వేరు వేరుగా మూడు కేగటిరీల్లో యూనిఫాం ను డిజైన్‌ చేయించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. రెడ్ అండ్ యాష్ కలర్‌ కాంబినేషన్ లో యూనిఫాం ను డిజైన్ చేయడం జరిగింది. 


1వ క్లాస్ నుండి 3వ క్లాస్ వరకు ఒక కేటగిరీ.. 4వ క్లాస్ మరియు 5వ క్లాస్ పిల్లలకు ఒక కేటగిరీ.. ఆ పై క్లాస్ పిల్లలకు ఒక కేటగిరీగా యూనిఫాం డిజైన్ ను ఖరారు చేయడం జరిగింది. అమ్మాయిలు మరియు అబ్బాయిలకు వేరు వేరుగా డిజైన్ లలో మొత్తం ఆరు రకాల డిజైన్ లను డిజైన్స్ రాష్ట్ర ప్రభుత్వంకు ఖరారు చేయడం జరిగింది. మొత్తం 24,27391 మంది విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం ను ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల పిల్లలు అని కాకుండా కార్పోరేట్ లుక్ ఉండే విధంగా యూనిఫామ్ ను డిజైన్‌ చేయించడం జరిగింది. 


వయసుకు తగ్గట్లుగా పిల్లల డిజైన్ లో మార్పులు చేయడం జరిగింది. అబ్బాయిల యూనిఫామ్ విషయానికి వస్తే 1వ క్లాస్ నుండి 7వ క్లాస్ పిల్లల వరకు రెడ్ షాట్‌ మరియు యాష్ కలర్ లో రెడ్ మిక్స్ అయిన షర్ట్స్ ను ఖరారు చేయడం జరిగింది. 8వ తరగతి నుండి 12వ తరగతి పిల్లల వరకు షర్ట్‌ విషయంలో మార్పు లేదు కానీ షార్ట్‌ కాకుండా పాయింట్ ను ధరించాల్సి ఉంటుంది. అబ్బాయిల యూనిఫాం డిజైన్ రెగ్యులర్‌ కంటే కాస్త భిన్నంగా డిజైన్‌ చేయడం జరిగింది. ఈ యూనిఫామ్‌ లో పిల్లలు చాలా స్టైలిష్ గా కార్పోరేట్ స్కూల్‌ పిల్లల మాదిరిగా కనిపిస్తారని అంటున్నారు. 


Also Read: Bandi Sanjay Comments: సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు.. ఈటల ఆ మాట అనలేదు: బండి సంజయ్  


ఇక అమ్మాయిల విషయంలో మూడ కేటగిరీల్లో కూడా మూడు విభిన్నమైన డిజైన్ ను ప్లాన్ చేశారు. ముఖ్యంగా 8వ తరగతి నుండి ఆపై క్లాస్ అమ్మాయిలకు యాష్ కలర్‌ షర్ట్‌ పై రెడ్ కలర్ లో యూ ఆకారపు కోట్‌ వస్తుంది. అమ్మాయిలు కూడా కొత్త డిజైన్ యూనిఫాం లో కార్పోరేట్‌ స్కూల్‌ పిల్లల మాదిరిగా ఉండబోతున్నారు అంటూ విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త యూనిఫాం తో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల వైపు జనాలు తిరిగి చూస్తారంటూ అధికారులు పేర్కొన్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు యూనిఫాం ను కుట్టడానికి మండల స్థాయిలో ఉన్న కుట్టు మిషన్ షాప్స్ కు.. స్థానిక టైలర్ల కు బాధ్యత అప్పగించబోతున్నారట. ఇందు కోసం మొత్తం 1,26,96,313 మీటర్ల యూనిఫాం క్లాత్‌ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మండల కేంద్రాలకు తరలించి ఆయా స్కూల్స్ కు పంపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మే 31 లోగా యూనిఫాం లు రెడీ అవ్వాలని అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నారు.


Also Read: Riva Arora Photos: ఈ రివా అరోరా పాపకు 13 ఏళ్లు అంటే నమ్ముతారా? ఇప్పుడే ఈ రేంజ్ హాట్ ట్రీట్ అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి