Dussehra Holidays 2024: దసరా సెలవులొచ్చేశాయి, ఎప్పట్నించి ఎన్ని రోజులంటే
Dussehra Holidays 2024: విద్యార్ధులకు శుభవార్త. దసరా సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో దసరాకు ఈసారి ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dussehra Holidays 2024: తెలంగాణలో దసరా అతి పెద్ద పండుగ. ఈ సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో దసరా సమయంలో సెలవులు ఎక్కువ రోజులుంటాయి. ఈసారి తెలంగాణలో 13 రోజులు సెలవులున్నాయి దసరాకు.
ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి. దసరా నవరాత్రులు 3వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. 12వ తేదీన విజయ దశమి పండుగ ఉంది. అందుకే దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచే ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకూ మొత్తం 13 రోజులు రాష్ట్రంలోని స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 15వ తేదీన తిరిగి తెర్చుకోనున్నాయి. ఈ 13 రోజుల్లోనే దసరా, బతుకమ్మ సెలవులు కలిపి ఉంటాయి. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అక్టోబర్ 1 నుంచి సెలవులు ప్రకటించాయి. మొత్తానికి 13 రోజులపాటు సుదీర్ఘ సమయం సెలవులు రావడంతో వివిధ ఊర్లకు వెళ్లేందుకు అందరూ సిద్ధమౌతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను మే 25నే విడుదల చేసింది. ఇందులో దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు ఉన్నాయి. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 27 వరకూ క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. ఇక జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు స్కూల్స్ నడవనున్నాయి. వచ్చే ఏడాది మార్చ్ నెలలోపదవ తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి.
Also read: Jio AirFiber Free: జియో నుంచి దీపావళి ధమాకా ఆఫర్, ఏడాది పాటు ఎయిర్‌ఫైబర్ ఉచితం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.