Jio AirFiber Free: దేశంలో అటు టెలీకం, ఇటు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రిలయన్స్ జియో తన స్థానం పదిలం చేసుకుంటోంది. ఇప్పటికే వివిధ ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎయిర్‌ఫైబర్ విభాగంలో కూడా మెజార్టీ షేర్ కోసం సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. అందులో భాగమే ఈ దీపావళి స్పెషల్ ఆఫర్.
రానున్న దీపావళి పండుగ పురస్కరించుకుని రిలయన్స్ డిజిటల్ కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. ఇదొక దీపావళి ధమాకా ఆఫర్. ఇందులో జియో ఎయిర్ ఫైబర్ ఏడాది పాటు ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమై నవంబర్ 3 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ అందించేది రిలయన్స్ డిజిటల్. అందుకే ఈ ఆఫర్ పొందేందుకు కస్టమర్లు రిలయన్స్ జియో లేదా మై జియో స్టోర్ నుంచి 20 వేల రూపాయలు కొనుగోలు చేయాలి. జియో ఎయిర్ ఫైబర్ 3 నెలల దీపావలి ప్లాన్ 2222 రూపాయలకు తీసుకునేవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే మూడు నెలల ప్లాన్ తీసుకుంటే మరో ఏడాది ఉచితంగా అందుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న జియో ఫైబర్, ఎయిర్ పైబర్ కస్టమర్లు కూడా 2222 రీఛార్జ్ చేయించుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.
అర్హత కలిగిన కస్టమర్లకు రిలయన్స్ జియో 12 కూపన్లు అందిస్తుంది. ఈ కూపన్లు నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు నెల నెలా ఉంటాయి. సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్స్‌లో 15 వేలు పైబడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు ఈ కూపన్లు ఉపయోగించవచ్చు.
రిలయన్స్ సంస్థ అందిస్తున్న వైర్‌లెస్ 5జి నెట్‌వర్క్ జియో ఎయిర్ ఫైబర్. ఇందులో మీ ఇంటిపై భాగంలో అవుట్ డోర్ యూనిట్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఇంట్లో వైర్‌లెస్ రూటర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ ధర నెలకు 599 రూపాయల నుంచి ప్రారంభమై 3999 రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5జి నెట్‌వర్క్‌తో పాటు నెలకు 550 డిజిటల్ ఛానెల్స్, 14 ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి. ఈ ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రైమ్ కూడా ఉండటం విశేషం.
Also read: AP Cyclone Alert: ఏపీకు మరోసారి తుపాను ముప్పు, 4-5 రోజుల్లో భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.