Telangana: తెలంగాణలో ప్రభుత్వ వైద్యులపై ఆంక్షలు, ఇక నుంచి నో ప్రైవేట్ ప్రాక్టీస్
Telangana: తెలంగాణలో ప్రభుత్వ వైద్యులపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇక నుంచి ప్రభుత్వ వైద్యులెవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు. ఆ నిబంధనలిలా ఉన్నాయి.
Telangana: తెలంగాణలో ప్రభుత్వ వైద్యులపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఇక నుంచి ప్రభుత్వ వైద్యులెవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు. ఆ నిబంధనలిలా ఉన్నాయి.
తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులపై ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులెవరూ ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే ఈ కొత్త ఆంక్షలు వర్తించనున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులుగా విధుల్లో ఉన్నవారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు.
రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల్నించి వైద్యులు విధులకు ఆలస్యంగా వస్తున్నారని..ఎక్కువ సెలవులు పెడుతున్నారని..పని సరిగ్గా చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జూనియర్ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి సస్పెన్షన్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతను ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేనప్పుడు..బయటకు ప్రిస్క్రిప్షన్ రాస్తే తప్పేంటని అంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో లోపాలు సరిదిద్దకుండా..ఆసుపత్రుల్ని మెరుగుపర్చడం ఎలా సాధ్యమంటున్నారు.
Also read: Mrigasira karthi: మృగశిర కార్తెకు అనుకోని వరం.. చేపల లారీ బోల్తా.. అరగంటలో ఖాళీ చేసినం జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook