Mrigasira karthi: మృగశిర కార్తె.. అనగానే మనకు గుర్తుకు వచ్చేది చేపలే. మృగళిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పూర్వకాలం నుంచి వస్తున్న మాట. అందుకే మృగశిర కార్తె రోజున చేపల కోసం జనాలు ఎగబడుతారు. ఆ రోజున ఏ ఫిష్ మార్కెట్ చూసినా విపరీతమైన రద్దీ ఉంటుంది. మృగశిర కార్తె రాగానే వెదర్ మారిపోతుంది. వేసవి తాపం నుంచి జనాలకు ఉపశమనం కల్గుతుంది. వెదర్ కూల్ కావడంతో బాడీలో టెంపరేచర్ తగ్గిపోతుంది. దీంతో శరీరంలో హీట్ పెంచడానికి మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారని టాక్. చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ప్రయోజనం ఉంటుందని వైద్యులు కూడా చెబుతుంటారు.
మృగశిర కార్తె ఎంట్రీకి రెండు, మూడు రోజుల ముందే జనాలు చేపల కోసం వేట మొదలుపెడతారు. చేపలు ఎక్కడ దొరుకుతాయో ఆరా తీస్తుంటారు. అలాంటి ఆ ఊరి జనానికి మాత్రం అనుకోని వరం తగిలింది. చేపలే వాళ్ల దగ్గరకి వచ్చి పడ్డాయి. ఇంకేం ఆ చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. అందినకాడికి తీసుకుని వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది ఈ ఘటన. చేపల లోడుతో వెళ్తున్న లారీ బూర్గంపాడులోని భద్రచాలం క్రాస్ రోడ్డు దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. లారీ ఫల్టీ కొట్టడంతో అందులోని లారీలన్ని రోడ్డుపై పడిపోయాయి. లారీ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు అక్కడి క్యూకట్టారు.
రోడ్జుపై పడి ఉన్న చేపలను తీసుకుని వెళ్లారు. బూర్గంపాడుతో పాటు సమీప గ్రామాల ప్రజలు నిమిషాల్లోనే చేపల లారీ దగ్గరకు భారీగా వచ్చారు. చేతికి అందినకాడికి చేపలను తీసుకెళ్లారు. తెల్లారే మృదశిర కార్తె కావడంతో చేపల కోసం జనాలు ఎగబడ్డారు. చిన్న పిల్లలతో పాటు వృద్ధులు కూడా చేపలు ఎత్తుకెళ్లడంలో పోటీ పడ్డారు. దీంతో లారీలో ఉన్న దాదాపు నాలుగు వేల చేపలు కేవలం అరగంటలోనే ఖాళీ అయ్యాయి. కొందరైతే బస్తాల కొద్ది చేపలు పట్టుకుపోయారు. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్ జామ్ అయింది, విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. ఏపీ నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రంలోని నాగపూర్ కు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read also:Hyderabad Gang Rape:దోషులను వదిలేసి.. ఆధారాలిచ్చిన ఎమ్మెల్యేపై కేసా! సిగ్గులేని ప్రభుత్వమన్న సంజయ్..
Read also: Amazon Smart TV Offers: అమెజాన్‌లో ఒక్కరోజే ఈ ఛాన్స్.. రూ.20వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.5739కే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook