Teachers Assets Declaration: టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు
Teachers Assets Declaration: హైదరాబాద్: విద్యా శాఖ ఉద్యోగులు ప్రతీ ఏడాది వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని తెలంగాణ విద్యా శాఖ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలకు టీచర్లు, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. దీంతో ఈ సంచలన నిర్ణయంపై తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గింది.
Teachers Assets Declaration: హైదరాబాద్: విద్యా శాఖ ఉద్యోగులు ప్రతీ ఏడాది వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని తెలంగాణ విద్యా శాఖ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలకు టీచర్లు, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. దీంతో ఈ సంచలన నిర్ణయంపై తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గింది. ఆర్.సి. నంబర్.192- ఎస్టాబ్లిష్‌మెంట్-1/2022 ప్రభుత్వ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. టీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలను నిలిపివేస్తున్నట్టుగా వెంటనే తాజా ఉత్తర్వులను జారీ చేయాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
అంతకంటే ముందుగా బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలు టీచర్ల ఆస్తుల ప్రకటన జీవోపై ఘాటుగా స్పందించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ భారీ మొత్తంలో అవినీతి సొమ్ము కూడబెట్టుకుంటున్న కేసీఆర్ కుటుంబం.. ఇప్పుడిలా ఎవరో ఒక్కరు తప్పు చేశారని టీచర్లు అందరినీ అదే దృష్టితో చూడటం సరికాదని హితవు పలికారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు సైతం దీనిపై కన్నెర్రచేశాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఇక కొత్త ఉద్యమాలు తప్పవు అని నేతలు అభిప్రాయపడుతున్న ప్రస్తుత తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) తమ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్టుగా హడావిడిగా పత్రిక ప్రకటన చేయడం గమనార్హం.
Also read : Telangana Govt: ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!
Also read : Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.