హైదరాబాద్: రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు రేపటికి సెలవు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగులు ఇవాళే మహిళా దినోత్సవం ఉత్సవాలు జరుపుకున్నారు.