Telangana Govt Extends Educational Institutions Holidays: తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడగించారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రకటించిన సంక్రాంతి సెలవులు (Telangana Sankranti 2022) నేటితో ముగియనుండటంతో సెలవులను పొడగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి విద్యా సంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. దీంతో సొంతూళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి స్కూళ్లు, కాలేజీల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సెలవులను పొడగిస్తూ చేసిన తాజా ప్రకటనతో చాలామంది సొంతూళ్లలోనే మరికొద్ది రోజులు గడపనున్నారు.


సెలవులను ఎక్కువ రోజులు పొడగించిన నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తారా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. మరో 14 రోజులు సెలవులు పొడగించడంతో పిల్లలు మళ్లీ ఎక్కడ చదువుకు దూరమవుతారేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా, కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో (Covid 19 cases in India) ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చాలా రాష్ట్రాలు విద్యా సంస్థలను మూసివేశాయి. ఢిల్లీలో డిసెంబర్ 28 నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్తాన్, బెంగాల్, గుజరాత్, మిజోరాం తదితర రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.


Also Read: Acharya New Release Date: ఆచార్య సినిమా విడుదలకు డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook