Show cause notice to 64 private hospitals: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలోనే కొవిడ్-19 చికిత్స పేరిట అడ్డగోలుగా బిల్లులు వసూలు చేయడమే కాకుండా చికిత్స విషయంలోనూ పలు కార్పొరేట్​, ప్రైవేట్​ ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అందిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలకు ఉపక్రమించడంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు అందిన 64 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందిన ఆస్పత్రులకు మాత్రమే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 64 ఆస్పత్రులపై కలిపి 88 ఫిర్యాదులు అందినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. షోకాజ్ నోటీసులు అందుకున్న ఆ 64 ప్రైవేటు ఆస్పత్రుల జాబితా ఇలా ఉంది. ఇందులో పలు కార్పొరేటు ఆస్పత్రులు సైతం ఉన్నాయి.


Also read : Telangana covid-19 cases: తెలంగాణ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటన్.. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులపై ఫోకస్


1) ఓమ్ని ఆసుపత్రి,కూకట్ పల్లి =6 ఫిర్యాదులు
2) VINN హాస్పిటల్, బేగంపేట = 5 ఫిర్యాదులు
3) TX హాస్పిటల్, కాచిగూడ = 3 ఫిర్యాదులు
4) ఉదయ్ ఓమ్ని హాస్పిటల్, అబిడ్స్ = 3 ఫిర్యాదులు
5) గ్లోబల్ హాస్పిటల్, ఎల్బీ నగర్ = 2 ఫిర్యాదులు
6) లైఫ్ లైన్ మెడిక్యూర్ హాస్పిటల్, ఆల్వాల్ = 2 ఫిర్యాదులు
7) లోటస్ హాస్పిటల్, లక్డికాపూల్ = 2 ఫిర్యాదులు
8) మ్యాక్స్ హెల్త్, కూకట్ పల్లి = 2 ఫిర్యాదులు
9) మ్యాక్స్ కేర్ హాస్పిటల్, వరంగల్=2 ఫిర్యాదులు
10) పద్మజ హాస్పిటల్, కూకట్ పల్లి = 2 ఫిర్యాదులు
11) సాయి సిద్ధార్థ హాస్పిటల్, షాపూర్ నగర్ =2 ఫిర్యాదులు
12) సాయి లైఫ్ హాస్పిటల్, కొండాపూర్ = 2 ఫిర్యాదులు
13) శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, కూకట్ పల్లి = 2 ఫిర్యాదులు
14) శ్రీకర హాస్పిటల్, సికింద్రాబాద్ = 2 ఫిర్యాదులు
15) విఆర్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్, న్యూ బోయిన్ పల్లి = 2 ఫిర్యాదులు
16) ఆదిత్య హాస్పిటల్, ఉప్పల్ = 1 ఫిర్యాదు
17) అజ్రా హాస్పిటల్, హన్మకొండ = 1 ఫిర్యాదు
18) అంకం హాస్పిటల్, నిజామాబాద్ = 1 ఫిర్యాదు
19) అంకుర హాస్పిటల్, ఎల్బీనగర్  = 1 ఫిర్యాదు
20) అపోలో హాస్పిటల్, హైదర్ గూడ = 1 ఫిర్యాదు
21) అరుణ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్, హస్తినాపురం = 1 ఫిర్యాదు
22) ఆషా హాస్పిటల్, కాప్రా  1 ఫిర్యాదు
23) అశ్విన్స్ హాస్పిటల్, పంజాగుట్ట = 1 ఫిర్యాదు
24) ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్ పేట్ = 1 ఫిర్యాదు
25) కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ =1 ఫిర్యాదు 
26) సెంచురీ హాస్పిటల్స్ , బంజారా హిల్స్ = 1 ఫిర్యాదు
27) కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలి = 1 ఫిర్యాదు
28) హ్యాపి హాస్పిటల్, మదినాగూడ = 1 ఫిర్యాదు
29) హర్ష హాస్పిటల్, చందానగర్ = 1 ఫిర్యాదు
30) హైదరాబాద్ నర్సింగ్ హోం = 1 ఫిర్యాదు


Also read : CM KCR review meeting: లాక్‌డౌన్, కొవిడ్-19, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ముఖ్యాంశాలు
31) ఇమేజ్ హాస్పిటల్స్, అమీర్ పేట = 1 ఫిర్యాదు
32) ఇంటెగ్రొ హాస్పిటల్, మెహదీపట్నం = 1 ఫిర్యాదు
33) జయ నర్సింగ్ హోం, హనుమకొండ = 1 ఫిర్యాదు
34) కిమ్స్, కొండాపూర్ = 1 ఫిర్యాదు
35) కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ = 1 ఫిర్యాదు
36) లలిత హాస్పిటల్, వరంగల్ = 1 ఫిర్యాదు
37) మ్యాక్సిక్యూర్ హాస్పిటల్, బీఎన్ రెడ్డి నగర్ = 1 ఫిర్యాదు
38) మెడిసిస్ హాస్పిటల్, చింతకుంట = 1 ఫిర్యాదు
39) యన్ కేర్ హాస్పిటల్, ఆర్సీపురం, పటాన్ చెరు =1 ఫిర్యాదు
40) నవజీవన్ హాస్పిటల్, కార్ఖానా =1 ఫిర్యాదు
41) నీలిమ హాస్పిటల్, సనత్ నగర్ =1 ఫిర్యాదు
42) నిఖిల్ హాస్పిటల్, శ్రీనగర్ కాలని=1 ఫిర్యాదు
43) ఒమెగా బన్ను హాస్పిటల్, వరంగల్ = 1 ఫిర్యాదు
44) ఓమ్ని హాస్పిటల్, కొత్తపేట = 1 ఫిర్యాదు
45) పంచవటి హాస్పిటల్, భూత్ పూర్ = 1 ఫిర్యాదు
46) ప్రసాద్ హాస్పిటల్స్, మియాపూర్ = 1 ఫిర్యాదు
47) ప్రతిమ హాస్పిటల్, కూకట్ పల్లి=1 ఫిర్యాదు
48) రాఘవేంద్ర హాస్పిటల్, బోయిన్ పల్లి =1 ఫిర్యాదు
49) రక్ష హాస్పిటల్, ఎల్బీ నగర్ = 1 ఫిర్యాదు
50) రెనోవా నీలిమ హాస్పిటల్స్, సనత్ నగర్ = 1 ఫిర్యాదు
51) సాయిరామ్ హాస్పిటల్, సంగారెడ్డి = 1 ఫిర్యాదు
52) షాలిని హాస్పిటల్, బర్కత్ పుర = 1 ఫిర్యాదు
53) షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్, చైతన్యపురి, దిల్ షుక్ నగర్ = 1 ఫిర్యాదు
54) శారద హాస్పిటల్, ఘట్ కేసర్, = 1 ఫిర్యాదు
55) శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, నిజాంపేట్ = 1 ఫిర్యాదు
56) స్టార్ హెల్త్ కేర్ హాస్పిటల్స్, హన్మకొండ = 1 ఫిర్యాదు
57) సన్ రిడ్జ్ హాస్పిటల్, మోతినగర్ = 1 ఫిర్యాదు
58) సన్ షైన్ హాస్పిటల్, మోతీ నగర్ =1 ఫిర్యాదు
59) సన్ షైన్ హాస్పిటల్, సికింద్రాబాద్ =1 ఫిర్యాదు
60) సుప్రజ హాస్పిటల్, సికింద్రాబాద్ = 1 ఫిర్యాదు
61) థంబే హాస్పిటల్, మలక్ పేట = 1 ఫిర్యాదు
62) ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, మలక్ పేట=1 ఫిర్యాదు
63) ట్రిడెంట్ హాస్పిటల్స్, శంషాబాద్ = 1 ఫిర్యాదు
64) టీఎక్స్ హాస్పిటల్, ఉప్పల్ = 1 ఫిర్యాదు. 


Also read : COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?


షోకాజ్ నోటీసులు అందుకున్న ఆస్పత్రులు ఇచ్చిన సమయంలోగా స్పందించకున్నా లేదా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోయినా వాటిపై చట్టరీత్యా చర్యలు (Legal action) తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో కొవిడ్-19 చికిత్సకు (COVID-19 treatment) ఎక్కువ బిల్లు వసూలు చేశాయనే ఫిర్యాదులే అధికంగా అందినట్టు సమాచారం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook