Telangana Govt Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మొత్తం 10,105 ఖాళీల భర్తీ చేపట్టే దిశగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు నేడు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. కొంతమంది ఉద్యోగాల గురించి ఉత్తుత్తి ప్రకటనలు చేసినట్టు కాకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 45,325 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా త్వరలోనే మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా విడుదల కానున్నాయని మంత్రి స్పష్టంచేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్న మంత్రి హరీశ్ రావు.. తాను పేర్కొన్నట్టుగా ఇప్పటివరకు తెలంగాణ సర్కారు 45,325 ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్స్ వివరాలను ఈ ట్వీట్‌లో జతపరిచారు.


Also read : Singareni Job Notification 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. సింగరేణిలో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్


Also read : Agnipath Violence: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే మాస్టర్ ప్లాన్? అందుకేనా హైదరాబాద్ పోలీసులు సైలెంట్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook