Agnipath Violence: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే మాస్టర్ ప్లాన్? అందుకేనా హైదరాబాద్ పోలీసులు సైలెంట్?

Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగమైంది. వందలాది మంది ఆందోళనకారులు దాదాపు 10 గంటలపాటు విధ్వంసం స్పష్టించడం షాకింగ్ గా మారింది. తెలంగాణలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఉద్యోగాల కోసం చాలా ఉద్యమాలు జరిగాయి.. కాని విధ్వంసాలు జరగలేదు

Written by - Srisailam | Last Updated : Jun 18, 2022, 07:02 PM IST
  • సికింద్రాబాద్ లో బీహార్ తరహా విధ్వంసం
  • అల్లర్ల వెనుక పీకే ఉన్నారంటున్న విపక్షం
  • హైదరాబాద్ పోలీసుల తీరుపై అనుమానాలు
Agnipath Violence: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే మాస్టర్ ప్లాన్? అందుకేనా హైదరాబాద్ పోలీసులు సైలెంట్?

Agnipath Violence: తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్.. ఇది సీఎం కేసీఆర్ ఎప్పుడు చెప్పేమాట. టెక్నాలజీ వాడకంలో హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. సీసీ కెమెరాలు ఎక్కువున్నది హైదరాబాద్ లోనే. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే కెపాసిటీ తమకు ఉందంటూ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చెబుతూ ఉంటారు. అలాంటి హైదరాబాద్ లో.. అత్యంత భద్రత ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగింది. రైల్వే స్టేషన్ లోకి చొరబడిన వందలాది మంది యువకులు.. దాదాపు 10 గంటల పాటు బీభత్సం స్పష్టించారు. మూడు రైళ్లను తగలబెట్టారు. 30 బోగీలను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్ల దాడి చేస్తూ విధ్వంసకాండ కొనసాగించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. అదే సమయంలో హైదరాబాద్ పోలీసుల నిఘా వైఫల్యానికి సాక్ష్యంగా నిలిచింది.

ఆర్మీలో నియామకాల కోసం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. దీనిపై మొదటగా బీహార్ లో అల్లర్లు జరిగాయి. రైలుకు నిప్పుపెట్టారు. అయితే బీహార్ లో ఇలాంటి ఘటనలు కామన్ కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగమైంది. వందలాది మంది ఆందోళనకారులు దాదాపు 10 గంటలపాటు విధ్వంసం స్పష్టించడం షాకింగ్ గా మారింది. తెలంగాణలో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఉద్యోగాల కోసం చాలా ఉద్యమాలు జరిగాయి.. కాని విధ్వంసాలు జరగలేదు. ఉవ్వెత్తిన ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈ తరహా అల్లర్లు జరగలేదు. విద్యార్థులు తమకు తాము నిప్పు అంటించుకున్నారు కాని.. ఇలా ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగలేదు. ఇటీవల కాలంలోనూ ఉద్యోగాల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాని విధ్వంసానికి మాత్రం దిగలేదు. అలాంటిది ఆర్మీ ఉద్యోగాల కోసమంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసానికి దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక పెద్ద కుట్రే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

నిఘా పెట్టడంలో, టెక్నాలజీ వాడకంలో ముందుండే హైదరాబాద్ పోలీసుల కళ్లు గప్పి వందలాది మంది పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి ఎలా వచ్చారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. విపక్షాలు ఆందోళనలకు పిలుపిస్తే .. రాత్రికి రాత్రే నేతలను అదుపులోనికి తీసుకుంటారు పోలీసులు. వాళ్ల ఫోన్లపై నిఘా పెట్టి ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి పట్టేస్తారు. అలాంటిది వాట్సాప్ గ్రూపుల్లో ఛాటింగ్ చేసుకుంటూ ఆందోళనకు ప్లాన్ చేసినా హైదరాబాద్ పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. ఆందోళనలు జరుగుతాయని తెలిసినా.. హైదరాబాద్ పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సూచనలతోనే హైదరాబాద్ పోలీసులు చూసిచూడనట్లుగా వ్యవహరించి విధ్వంసానికి కారకులయ్యారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆందోళనకారులు రైల్వే స్టేషన్ లోకి చొరబడి రైళ్లపై దాడులు చేస్తున్నా... దాదాపు గంట వరకు స్టేట్ పోలీసులు అక్కడికి రాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతోనే  హైదరాబాద్ కాప్స్ స్పాట్ కు ఆలస్యంగా వచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిన కుట్రని అంటున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తెలంగాణలోనే బీహార్ తరహా అల్లర్లు జరిగాయని అంటున్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగా దాడులు, అల్లర్లకు పీకే ప్లాన్ చేస్తారనే టాక్ మొదటి నుంచి ఉంది. ఏపీలో జగన్ కు వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో జరిగిన తుని ఘటన,  కొడికత్తి దాడి అందులోనే భాగమంటారు. తునిలోనూ రైలును తగలబెట్టారు. సికింద్రాబాద్ లోనూ రైళ్లను తగలబెట్టారు. తుని ఘటనకు, సికింద్రాబాద్ ఘటనకు పోలిక ఉందనే టాక్ వస్తోంది. ఇదే అంశం సోషల్ మీడియాలోనూ ట్రోల్ అవుతోంది.

బెంగాల్ లోనూ మమతా బెనర్జీ కోసం ఇలాంటి వ్యూహాలను పీకే రచించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. ఈ సమయంలోనే అల్లర్లు జరగడంతో.. ఇదంతా పీకే వ్యూహంలో భాగంగానే జరిగిందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంస ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా కేసీఆర్ కుట్రలో భాగంగానే అల్లర్లు జరిగాయని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లు కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారని.. ప్రభుత్వ కుట్రలో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి జరిగిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పీకే ఎత్తుగడల్లో భాగంగానే కేసీఆర్ ఇలాంటి కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు బీజేపీ, కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నాయి. 

Read also: Agnipath Protests: సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్దరణ.. అల్లర్లపై కేసు నమోదు  

Read also: Agnipath Scheme Details: అగ్మిపథ్‌పై ఎందుకీ ఆందోళన, కారణాలేంటి, అగ్నిపథ్ అంటే ఏంటి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News