శంషాబాద్ వరకు మెట్రో పొడిగింపు..!
మెట్రో భాగ్యనగరానికి మకుటారాహారం. అలాంటి మెట్రోను ఇప్పడు ఏకంగా శంషాబాద్ వరకు పొడిగిస్తున్నట్లు సమాచారం. మెట్రో వచ్చాక నగర ప్రజల నుండి వచ్చిన అనూహ్య స్పందనే దీనికి కారణం.
మెట్రో భాగ్యనగరానికి మకుటారాహారం. అలాంటి మెట్రోను ఇప్పడు ఏకంగా శంషాబాద్ వరకు పొడిగిస్తున్నట్లు సమాచారం. మెట్రో వచ్చాక నగర ప్రజల నుండి వచ్చిన అనూహ్య స్పందనే దీనికి కారణం. రెండో దశ పనుల్లోనే మెట్రో శంషాబాద్ వరకు పొడిగిస్తున్నట్లు మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను అనుసంధాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే మెట్రోను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగిస్తున్నాము అన్నారు. రెండో దశలో మెట్రో 80 కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మెట్రోను ఎయిర్ పోర్ట్ కు అనుసంధానించారా? లేదా ? ఆ విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అని అడిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన మంత్రివర్గ సహచరులతో కొంతమంది వద్ద మెట్రో శంషాబాద్ వరకు పొడిగిస్తే ఎలా ఉంటుంది? అని అభిప్రాయాలు కూడా తీసుకున్నారట. ఎయిర్ పోర్ట్ కు మెట్రో అనుసంధానం అనే అంశంపై ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.