Ganesh idol immersion : హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రివ్యూ పిటిషన్ వేస్తాం, హైకోర్టు పెద్ద మనసు చేసుకోవాలి: తలసాని
Telangana govt to file review petition in High Court : హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పు వచ్చిందని, అయితే అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Talasani says file a review petition on the immersion of Ganesh idols: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. హైకోర్టు (High court) తీర్పుపై పిటిషన్ దాఖల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం తరఫున సోమవారం హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పు వచ్చిందని, అయితే అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయన్నారు.
Also Read : life lessons you can learn from Lord Vinayaka: గణేశుడిలో ఉండే ప్రత్యేక గుణాలను అలవర్చుకుంటే మంచి భవిష్యత్తు
భవిష్యత్తులో ముందస్తు ఆదేశాలు ఇస్తే
ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటే కష్టమన్నారు తలసాని. హైదరాబాద్‌లో ఇప్పటికిప్పుడు కుంటల ఏర్పాటు ఇబ్బందని, హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ముందస్తు ఆదేశాలు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమయం లేనందున హైకోర్టు కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ ఏడాదికి యథావిధిగా నిమజ్జనం (Immersion) చేసేలా అవకాశం కల్పించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను సర్కారు బాధ్యతగా తీసుకుంటుందన్నారు ఆయన. 48 గంటల్లో వ్యర్థాలు తీసేస్తామని స్పష్టం చేశారు.
భక్తులు, ఉత్సవాల నిర్వాహకుల మనోభావాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గణేష్ శోభ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, హైదరాబాద్ గణేష్ (Ganesh) ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
Also Read : హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ మాకెందుకు ఇవ్వరు? స్టార్ హీరోయిన్ ఫైర్