Telangana Schools Re Open: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజులో (జనవరి 31) సెలవులు ముగియనున్నాయి. దాంతో విద్యా సంస్థలు తెరుస్తారా? లేదా సెలవులను పొడగిస్తారా? అనే అనుమానం అందరిలో నెలకొంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ఓపెన్ (Schools Re Open) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం తెలుస్తోంది. నేడు ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 31 నుంచి విద్యా సంస్థలు తెరుస్తారా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పంచారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఇక రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్‌ శ్రీనివాసరావు ఆన్‌లైన్‌లో వివరించారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలోనే విద్యా సంస్థలు తెరవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 


Also Read: Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!


పదవ తరగతి ఎగ్జామ్స్ కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని విద్యార్థుల పేరెంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై (TS Govt) ఒత్తిడి తెస్తున్నారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసెస్ నిర్వహిస్తున్నా పెద్దగా ఉపయోగం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో స్కూల్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో ఇక్కడ కూడా విద్యా సంస్థలు (Educational Institutions) ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. వైద్య ఆరోగ్య శాఖ కూడా  విద్యా సంస్థలు తెరిచేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. 


Also Read: Chiranjeevi Mother: నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి! చిరంజీవి భావోద్వేగం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి